
* డిజైనింగ్ లో.. నిర్మాణంలో లోపాలున్నాయి
* కేసీఆర్ నిపుణుల కమిటీ సూచనలను పట్టించుకోలేదు
* నిపుణుల సలహాలకు విరుద్ధంగా మేడిగడ్డ వద్ద నిర్మాణం
*కాళేశ్వరం పై పీసీ ఘోష్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం
* అసెంబ్లీకి కేసీఆర్ వస్తే బాగుండేది : సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు( KALESHWERAM PROJECT) పై అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)సభకు వస్తే బాగుండేదని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి (REVANTH REDDY)అన్నారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్(JUSTICE PC GHOSHE) ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. పీసీ ఘోష్ నివేదికకు సంబందించిన పెన్ డ్రైవ్ లను అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. సరైన ప్రణాళిక లేకుండా మేడిగడ్డ నిర్మాణం చేపట్టారని తెలిపారు. 3 ప్రాజెక్టుల ప్రణాళిక, నిర్మాణంలో పూర్తి లోపాలు ఉన్నాయన్నారు. కాళేశ్వరంలో తప్పిదాలున్నాయని నిపుణుల కమిటీ సూచలను కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. భూగర్భ పరిస్థితులు దృష్టిలో పెట్టుకోలేదని నివేదికలో ఉందని స్పష్టం చేశారు.
కాంట్రాక్టర్ల లబ్ధికే..
కాళేశ్వరం డిజైన్, నిర్మాణ నాణ్యతలో లోపాలున్నాయని రిపోర్టులో వెలువడిందని సీఎం రేవంత్ తెలిపారు. అన్నారం బ్యారేజ్లో మట్టి అంచనాలు తప్పుగా ఉన్నాయని పేర్కొన్నారు. పనుల పర్యవేక్షణలో కూడా లోపాలున్నాయని విమర్శించారు. ప్రాజెక్టు CWC అనుమతుల్లోనూ లోపాలున్నట్లు పీసీ ఘోష్ నివేదిక చెబుతున్నట్లు చెప్పుకొచ్చారు. కాంట్రాక్టర్ల లబ్ధికే అంచనాల పెంపు నిబంధనలు సడలించారని విమర్శించారు. ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చాలన్న దురుద్దేశంతో అంచనాలు సవరించారని ఆరోపించారు. అంచనాలు సవరించి ఖజానాకు నష్టం చేకూర్చారని నివేదికలో పేర్కొందని స్పష్టం చేశారు. అన్నారం(ANNARAM), సుందిళ్ల(SUNDILLA), మేడిగడ్డ (MEDIGADDA)నిర్వహణ సరిగా లేదని కమిషన్లో ఉందన్నారు. క్వాలిటీ కంట్రోల్ సరిగా లేదు, ఆనకట్టల డిజైన్లు, డ్రాయింగ్స్లో లోపాలు ఉన్నాయని ధ్వజమెత్తారు.నిబంధనలకు విరుద్ధంగా బ్యారేజీ నిర్మాణాలకు బడ్జెట్ విడుదల అయింది. మూడు బ్యారేజీల ప్లానింగ్, డిజైన్స్, నిర్మాణాన్ని ప్రతి నిమి గత సీఎం కేసీఆర్ ఫాలోఅప్ చేశారని రేవంత్ అన్నారు. మేడిగడ్డ నిర్మాణం కోసం నిపుణుల కమిటీ సిఫారస్సు చేయకపోయినా గత ముఖ్యమంత్రి ఆదేశాలతో మేడిగడ్డ నిర్మాణం జరిగిందని రేవంత్ అన్నారు.
…………………………………………………….