* ఆకట్టుకుంటున్న కాళోజీ కళాక్షేత్రం
* శర వేగంగా పనులు
* ఈ నెల 9న సీఎం చేతుల మీదుగా ప్రారంభం
* పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ఆకేరు న్యూస్, వరంగల్ కల్చరల్ : ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం పనులు పూర్తయినాయి. పనులు పూర్తి కావడంతో కళాక్షేత్రం ఆకర్షణీయంగా కనిపిస్తోంది. వారెవ్వా కళా క్షేత్రం అనే విదంగా ఉందని కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.సాంస్కృతిక వారసత్వానికి కేంద్రంగా ఉన్న ఓరుగల్లు నగరంలో అద్భుత వేదికగా ఈ కళా క్షేత్రం మారుతుందని కళాకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు . ఈ నెల 9 వ తేదీన కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా ఈ కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు.
* వేగంగా పనులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశం
గురువారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు.నిర్మాణ పనుల్లో అదనపు పనులు ఏవైనా మిగిలి ఉంటే వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఇప్పటి వరకు పూర్తయిన కళాక్షేత్రం పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. కళాక్షేత్రంలో నిర్మాణ పనులకు సంబంధించి న వివరాలను ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ప్రావీణ్య అడిగి తెలుసుకున్నారు.గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, ఇతర శాఖల అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
——————————-