
* ఎమ్మెల్సీ కవితపై మహేష్ కుమార్ గౌడ్ సెటైర్లు
* బీఆర్ ఎస్ లో దెయ్యాలు ఏమయ్యాయని ప్రశ్న
* కవితను చూసి జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా
ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత చేస్తున్న హంగామా చూస్తుంటే నవ్వొస్తోందని పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం దేశ చరిత్ర లోనే ప్రథమం అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కవితకు బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. బీఆర్ ఎస్ హయాంలో సామాజిక న్యాయం జరుగలేదని ఒప్పుకున్న కవిత మరి ఆ పార్టీకి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. బీ ఆర్ ఎస్ లో దెయ్యాలు ఉన్నాయని చెప్పిన కవిత మరి ఇప్పుడు ఆ దెయ్యలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆ దెయ్యాలెవరో చెపితే ప్రజలు కూడా తెలుసుకుంటారని హితవు పలికారు. రంగులు మార్చినంత మాత్రాన పిల్లి పులి కాలేదని పేర్కొన్నారు. కవిత మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆమె ఏ పార్టీలో ఉందో అర్థం కావడం లేదని విమర్శించారు.బీసీల మీద ఇప్పుడు మొసలి కన్నీరు ఒలకబోస్తున్న కవితకు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నపు్పుడు బీసీలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం కవితకు మిండుడు పడడం లేదని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
………………………………………….