Karimnagar Traffic Restrictions
ఆకేరు న్యూస్, కరీంనగర్ : ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కరీంనగర్ నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో భాగంగా పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నట్లు వెల్లడించారు.
ప్రతిమ థియేటర్ టీ జంక్షన్ నుంచి మమత థియేటర్ మీదుగా భగత్‌నగర్ టీ జంక్షన్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని సీపీ పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడకుండా ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.
ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా విధులు నిర్వహించే పోలీసులకు ప్రజలు, వాహనదారులు సహకరించాలని సీపీ గౌష్ ఆలం విజ్ఞప్తి చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
