Karthi starrer Sardar 2 Release
* లార్జర్ స్కేల్లో యాక్షన్ ప్యాక్డ్ స్పై థ్రిల్లర్
ఆకేరు న్యూస్, సినిమా: తమిళ, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సర్దార్కు సీక్వెల్‌గా తెరకెక్కిన సర్దార్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కార్తి హీరోగా, పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. సెప్టెంబర్ 10న ‘సర్దార్ 2’ (sardar 2) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో కార్తి సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
* పది రెట్లు ఇంపాక్ట్ ఉంటుంది
సర్దార్లో వాటర్ కాన్సెప్ట్ ప్రేక్షకులపై ఎంతటి ప్రభావాన్ని చూపిందో.. దానికి పది రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ సర్దార్ 2 కాన్సెప్ట్ క్రియేట్ చేస్తుందని కార్తి తెలిపారు. ఈసారి సినిమాను మరింత లార్జర్ స్కేల్లో రూపొందించామని చెప్పారు. ఇండియాలో స్పై సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయని, అలాంటి కథలను తెరకెక్కించడం అంత సులభం కాదన్నారు. ‘సర్దార్’లో లుంగీ ధరించిన గూఢచారి అనే ఆలోచన తనను వెంటనే ఆకట్టుకుందని చెప్పారు. గూఢచారులు మన మధ్యే సాధారణ వ్యక్తుల్లా జీవిస్తూ, తమ పని గురించి ఎవరికీ తెలియకుండా ఉంటారనే అంశం ఆసక్తికరంగా అనిపించిందన్నారు.
* దేశం కోసం త్యాగం చేసే గూఢచారి
సర్దార్లో ఒక గూఢచారి సమాజం కోసం చేసే పోరాటాన్ని చూపించామని కార్తి తెలిపారు. దేశం కోసం ఒక వ్యక్తి తన జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని త్యాగం చేయడం సాధారణ విషయం కాదన్నారు. ఆ పాత్రలో చాలా లేయర్స్ ఉన్నాయని చెప్పారు. సీక్వెల్లో సర్దార్ తిరిగి రావడానికి కారణం, అలాగే ఎస్జే సూర్య పోషిస్తున్న విలన్ పాత్ర వెనుక ఉన్న అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని, అయితే ఇప్పుడే సర్దార్ 2 కాన్సెప్ట్‌ను పూర్తిగా వెల్లడించలేనని కార్తి అన్నారు. సర్దార్ 2 లో గూఢచారి కథ ఇండియాలోనే జరిగే ఒక సమస్య చుట్టూ సాగుతుందని కార్తి తెలిపారు. సాధారణంగా స్పై సినిమాల్లో దేశం బయట జరిగే ఆపరేషన్లు ఎక్కువగా కనిపిస్తాయని, కానీ ఇందులో ఇండియాలో ఎదురయ్యే సమస్యను ఒక గూఢచారి ఎలా పరిష్కరించాడనేది చూపించామని చెప్పారు.
* విజువల్స్, యాక్షన్‌కు హై స్టాండర్డ్స్
సినిమాను చాలా భారీ స్థాయిలో తెరకెక్కించామని కార్తి తెలిపారు. మొదటి నుంచి చివరి వరకు అద్భుతమైన యాక్షన్ బ్లాక్స్ ఉంటాయని, ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయని అన్నారు. సర్దార్ 2 కాన్సెప్ట్, విజువల్స్ పరంగా చాలా హై స్టాండర్డ్‌లో ఉంటుందని, సౌత్‌లో కూడా ఇంత గొప్ప స్థాయిలో స్పై సినిమా చేయగలమని చూపించే చిత్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఫాదర్, సన్ క్యారెక్టర్స్ కలిసి ట్రావెల్ చేస్తాయని కార్తి చెప్పారు. రెండు పాత్రలను ఒకేసారి పోషించడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించిందన్నారు. మేకప్ విషయంలో కూడా చాలా ఓపికతో పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు.
తనకు యాక్షన్ అంటే చాలా ఇష్టమని, అయితే ఓల్డ్ మాన్ పాత్రలో ఫైట్స్ చేయడం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. ఆ పాత్ర వయసు మీద పడినా చాలా స్కిల్‌ఫుల్‌గా ఉంటుందని, గూఢచారి కావడంతో తన దగ్గర అనేక ఫైటింగ్ టెక్నిక్స్ ఉంటాయని చెప్పారు. యాక్షన్ సన్నివేశాలను ఎంతో ఎంజాయ్ చేసినట్లు తెలిపారు.
* ముగ్గురు హీరోయిన్లకు ప్రత్యేక పాత్రలు
సర్దార్ 2 లో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని కార్తి తెలిపారు. ఆశిక రంగనాథన్, మాళవిక మోహనన్ పోషిస్తున్న పాత్రల్లో కొత్త డైమెన్షన్ ఉంటుందని చెప్పారు. సాధారణ హీరోయిన్ పాత్రలకు భిన్నంగా, చాలా ఇంటెలిజెంట్‌గా ఉంటాయని తెలిపారు. అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో, దేశం కోసం వారు ఎలా పోరాడతారో కూడా సినిమాలో చూపించామని కార్తి వెల్లడించారు.
ఎస్జే సూర్య పోషిస్తున్న పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, ప్రేక్షకులు ఆ పాత్రను బాగా ఎంజాయ్ చేస్తారని కార్తి అన్నారు. ‘స్పైడర్’లో ఏది మిస్ అయిందో.. ‘సర్దార్ 2’లో అది వర్కౌట్ అయిందని సూర్య చెప్పారని తెలిపారు. తన పాత్రకు ఎస్జే సూర్య స్వయంగా డబ్బింగ్ చెప్పారని వెల్లడించారు.
* వందే భారత్ ట్రైన్ సెట్
సర్దార్ 2 లో హై వాల్యూ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయని కార్తి చెప్పారు. సినిమా కోసం ఏకంగా వందే భారత్ ట్రైన్ మొత్తాన్ని సెట్‌గా రూపొందించారని తెలిపారు. ఇలాంటి ప్రయత్నం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదని అన్నారు. సినిమా కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేశారని, ఎక్కడా రాజీ పడకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా భారీ స్థాయిలో చిత్రీకరించారని కార్తి చెప్పారు.
* తెలుగు ప్రేక్షకులపై ప్రత్యేక అభిమానం
సర్దార్‌ను తమిళ ప్రేక్షకుల కంటే తెలుగు ప్రేక్షకులు మరింతగా ఆదరించారని కార్తి గుర్తుచేసుకున్నారు. సినిమా విడుదల తర్వాత ఒకసారి ముగ్గురు కుర్రాళ్లు తన కారు వెనుక వచ్చి ‘వాటర్ బాటిల్ ప్లాంట్స్‌ని మేము రానివ్వము’ అంటూ నినాదాలు చేశారని చెప్పారు. చిన్న పిల్లల వరకు సినిమా చెప్పిన విషయం చేరడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. సర్దార్ 2 చూడబోయే ప్రేక్షకులు సర్దార్‌ను చూడకపోతే ముందుగా ఆ సినిమా చూడాలని కార్తి సూచించారు. యూట్యూబ్‌లో సర్దార్‌ను ఉచితంగా అందుబాటులో ఉంచామని, ఇప్పటికే చూసిన వారు కూడా మరోసారి రీవాచ్ చేస్తే సీక్వెల్‌కు మరింతగా కనెక్ట్ అవుతారని చెప్పారు. సర్దార్ 2 ను అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం పట్ల కార్తి సంతోషం వ్యక్తం చేశారు. మంచి సినిమా ఉన్నప్పుడు తాను కాన్ఫిడెంట్‌గా ఉంటానని, నాగార్జున అన్నయ్య ఉన్నప్పుడు మరింత కాన్ఫిడెంట్‌గా ఉంటానన్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్‌తో తమకు మంచి అనుబంధం ఉందని, సినిమాకు ఏం కావాలో వారు అద్భుతంగా చేస్తారని చెప్పారు. సర్దార్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారానే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిందని, ఇప్పుడు సర్దార్ 2 కూడా అదే సంస్థ ద్వారా విడుదల కావడం ఆనందంగా ఉందన్నారు.
* మిత్రన్ పై కార్తి ప్రశంసలు
దర్శకుడు పీఎస్ మిత్రన్ అద్భుతమైన స్కిల్ ఉన్న దర్శకుడని కార్తి ప్రశంసించారు. ప్రేక్షకులకు ఏం కావాలో తెలుసుకుని అందుకు తగ్గట్టుగా కాన్సెప్ట్‌ను డిజైన్ చేస్తారని చెప్పారు. ‘సర్దార్ 1’తో పోలిస్తే ఇప్పుడు మిత్రన్‌లో మరింత పరిణితి కనిపిస్తోందన్నారు. తనతో కలిసి ఎస్జే సూర్య సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారని కార్తి తెలిపారు. తమకు కూడా కలిసి సినిమా చేయాలనే ఆసక్తి ఉందని, అయితే అందుకు సరైన కథ, దర్శకుడు కుదరాలని అన్నారు. అలాంటి కథ కోసం తామిద్దరం కూడా ఎదురు చూస్తున్నామని చెప్పారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
