Producers Council Election Natti Kumar
* ఇద్దరు నిర్మాతల మధ్య వాగ్వాదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రాంగణంలో నిర్మాతలైన నట్టి కుమార్, బెక్కెం వేణుగోపాల్ మధ్య వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.. ఓట్ పంపిణీ చేసే టేబుల్ వద్ద బెక్కెం వేణుగోపాల్ నిలబడటంపై నిర్మాత నట్టి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
* స్వల్పంగా .. క్రమంగా తీవ్రరూపం
ఈ క్రమంలో మొదట స్వల్పంగా ప్రారంభమైన వాగ్వాదం క్రమంగా తీవ్రరూపం దాల్చడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో అక్కడ ఉన్న పలువురు నిర్మాతలు, కౌన్సిల్ సభ్యులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కొంతసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు సమాచారం.ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఈ పరిణామంతో అక్కడ ఉన్న సభ్యుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాల్సిన సమయంలో వివాదం తలెత్తడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు కనిపించాయి.
* సర్దిచెప్పిన నిర్మాత సి.కళ్యాణ్
రంగంలోకి దిగిన నిర్మాత సి.కళ్యాణ్.. నట్టి కుమార్, వేణుగోపాల్ లతో మాట్లాడి శాంతింపజేశారు. దీంతో ఎన్నికల ప్రాంగణంలో పరిస్థితులు సాధారణస్థితికి వచ్చాయి. అనంతరం వేణుగోపాల్ మాట్లాడుతూ, తాను ఎలాంటి ప్రచారం చేయడం లేదన్నారు. తోటి నిర్మాతలను పలకరించేందుకే వచ్చానని తెలిపారు.
* అసలు ఎన్నికలు ఏ పోస్టులకు జరుగుతున్నాయి?
రెండు ఉపాధ్యక్షులు, రెండు కార్యదర్శి , రెండు జాయింట్ సెక్రటరీ, ఒక కోశాధికారి పోస్టులకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రొగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ మధ్య పోటీ జరుగుతుంది. అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు ప్రొగ్రెసివ్ కు మద్దతు ఇస్తున్నారు. మన ప్యానెల్ కు చదలవాడ శ్రీనివాసరావు మద్దతు ఇస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
