తూర్పు ఢిల్లీలోని కస్తూర్బా నగర్ ప్రాంతంలో కుప్పకూలిన రెండంతస్తుల భవనం
* శిథిలాల కింద ఆరుగురు
* ఒక్కసారిగా కుప్పకూలిన భవనం..
* కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో (Delhi Building Collapse) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. (East Delhi) తూర్పు ఢిల్లీలోని కస్తూర్బా నగర్ ప్రాంతంలో రెండంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. భవనం కూలిపోవడంతో స్థానికంగా (Delhi Building Collapse) తీవ్ర కలకలం రేగింది. భవనం పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో అందులో ఉన్నవారు ప్రమాదానికి గురయ్యారు. శిథిలాల కింద మరో ఆరుగురు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
* శిథిలాల తొలగింపు.. సహాయక చర్యలు..
శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. శిథిలాలను తొలగిస్తూ బాధితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఘటనతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతుండటంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

