
ఆకేరున్యూస్ హైదరాబాద్ : మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరారు. ఈ నెల 3న కేసీఆర్ సోడియం,షుగర్ లెవల్స్ తగ్గిపోవడంతో యశోధలో చేరిన విషయం తెల్సిందే.. రెండు రోజులు ఆస్పత్రిలో గడిపిన కేసీఆర్ 5న డిశ్చార్జి అయ్యారు. తిరిగి వారం రోజుల తరువాత పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని డిశ్చార్జి సమయంలో ఆస్పత్రి వైద్యులు తెలపడంతో తిరిగి గురువారం కేసీఆర్ యశోధలో చేరారు.
……………………………………………….