* మీ కుటుంబం వద్ద లక్ష కోట్లున్నాయ్ * అమెరికాలో ఉండి కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నడు * సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం * మహబూబాబాద్ జిల్లాలో పర్యటన * వరద బాధితులకు అండగా ఉంటామని వెల్లడి * మూడు తండాలు కలిపి గ్రామంగా కలుపుకుతాం * అందరికీ ఒకేచోట ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం.. * వరద నష్టంపై మహబూబాబాబాద్ కలెక్టరేట్ లో సమీక్ష
ఆకేరు న్యూస్, మహబూబాబాద్: కేసీఆర్ కుటుంబం వద్ద రూ.లక్ష కోట్లు ఉన్నాయని, సీఎం సహాయనిధికి రూ.2వేల కోట్లు ఇవ్వొచ్చుగా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana Chief Minister Revanthreddy)సెటైర్లు వేశారు. కేటీఆర్(Ktr) అమెరికాలో ఉండి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే పదేళ్ల బీఆర్ ఎస్(Brs) పాలనలోనే తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఆక్రమణలు, కబ్జాలు పెరిగాయన్నారు. చెరువులు, కుంటల కబ్జాలపై వెనక్కి తగ్గేదిలేదన్నారు. ఆక్రమణలకు సహకరించిన అధికారులపైనా చర్యలుంటాయన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు కూడా రేవంత్ పర్యటించారు. పురుషోత్తమయ్యగూడెం వద్ద తెగిన రోడ్డును పరిశీలించారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా(Mahaboobabadh)లో వరద నీటిలో కొట్టుకుపోయిన యువ శాస్త్రవేత్త కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఈ రోజు ప్రభుత్వమే ప్రజలకు దగ్గరకు కదిలి వచ్చిందన్నారు. చనిపోయిన కుటుంబానికి రూ.50లక్షలు ఇవ్వాలని బీజేపీ నేత ఈటల(Etala) డిమాండ్ చేస్తున్నారని, ఆ నిధులను కేంద్రం నుంచి ఈటల తేవాలని డిమాండ్ చేశారు. అనంతరం మహబూబాబాద్ కలెక్టరేట్ (Mahaboobabadh Collectarate)లో వరద నష్టంపై అధికారులతో సమీక్ష, సమావేశం నిర్వహించామన్నారు. మున్నేరుపై ఇంజినీర్లతో చర్చిస్తామని, మున్ముందు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. మిషన్ కాకతీయలో దోపిడీ జరగడం వల్లే చెరువుల తెగిపోయాయన్నారు. ఖమ్మం(khamam), కృష్ణా(Krishna) జిల్లాలు కవల పిల్లలుగా ఉన్నాయని కృష్ణా జిల్లా కంటే ఖమ్మంలోనే రికార్డు స్థాయిలో 42సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడం వల్లే పెద్ద నష్టం తప్పిందని తెలిపారు. ప్రభుత్వం ఎంత ముందస్తు చర్యలు చేపట్టినా, ప్రకృతి పేదలను పొట్టనబెట్టుకుందని వాపోయారు. నష్టం జరిగిన వారికి సహాయం అందించే చర్యలను ప్రభుత్వం చేపడుతుందన్నారు.
మూడు తండాలు కలిపి పెద్ద గ్రామంగా ఏర్పాటు చేస్తాం..
మూడు తండాలు కలిపి పెద్ద గ్రామంగా ఏర్పాటు చేస్తామని, ఇల్లు కోల్పోయిన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పది రోజులకు సరిపడా నిత్యావసరాలు, చేతి ఖర్చులకు రూ.10వేలు తక్షణ సాయంగా అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఆస్తి పత్రాలు, పిల్లల సర్టిఫికెట్లు, ప్రభుత్వ గుర్తింపు పత్రాలు పాడైపోతే వివరాలు సేకరించి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కొత్త సర్టిఫికెట్లు ఇవ్వడానికి తగిన చర్యలు చేపట్టాలన్నారు. అందుకు అవసరమైతే ప్రత్యేకమైన అనుమతులు ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Pongulati Srinivasreddy), సీతక్క(Seethakka), ఎమ్మెల్సీ మల్లన్న(Mlc Mallanna) తదితరులు ఉన్నారు.
————————-