
* ప్లేస్ డిసైడ్ చేయండి చర్చకు రెడీ
* కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది
* కేంద్రమంత్రి బండి సంజయ్
ఆకేరున్యూస్ జనగామ ః మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి జల్సాలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. జనగామ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నట్లు అనుమానాలు వస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. బీఆర్ ఎస్ కాంగ్రెస్
పార్టీలు రెండూ ఒకే తానులోని ముక్కలే అని బండి అన్నారు. బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏంటో చూపాలని బండి సవాల్ విసిరారు. అభివృద్ధిపై చర్చించడానికి తాను ఏ గ్రామానికైనా రావడానికి సిద్ధంగా ఉన్నానని బండి అన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలను పరిష్కరించడం కేంద్రం బాధ్యత అని బండి సంజయ్ అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను కేంద్రం పరిష్కరించాలని చూస్తుంటే కేంద్రాన్నే తప్పుపడుతున్నారని ఆరోపించారు. రెండు రాష్రాల ప్రయోజనాలను కాపాడడం కేంద్రం బాధ్యత అన్నారు. తెలంగాణ పేరుతో బీఆర్ ఎస్ మళ్లీ రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తోందని బండి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డ వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడంలేదని బండి ప్రశ్నించారు.
బీసీలకు అన్యాయం
సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు అన్యాయం చేస్తున్నరని బండి విమర్శించారు.బీసీలకు ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలే ఉన్నారని బండి అన్నారు.దామాషా ప్రకారం బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని బండి డిమాండ్ చేశారు.
…………………………….