* 2.97 లక్షల కోట్లుగా ఉండే చాన్స్
* అసెంబ్లీకి చేరుకున్న భట్టి విక్రమార్క
* బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్న కేసీఆర్!
* అనంతరం అసెంబ్లీ నుంచి కాళేశ్వరానికి బీఆర్ఎస్ బృందం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అసెంబ్లీ (Assembly) లో ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్జెట్ (Telangana Budget) పై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. కేంద్ర బడ్జెట్ (Union Budget) లో తెలంగాణ ప్రభుత్వ ప్రస్తావన లేని నేపథ్యంలో రాష్ట్ర సర్కారు కేటాయింపులు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఓటాన్ బడ్జెట్ 2.75 లక్షల కోట్లు కాగా, బడ్జెట్ 2.97 లక్షల కోట్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు లేకున్నా, రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేలా కేటాయింపులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అభివృద్ధి, సంక్షేమం ప్రాధాన్య అంశాలుగా ఉండనున్నాయి. ఆరు గ్యారెంటీల (Six guarantees )కు భారీగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. శాసనసభలో బడ్జెట్ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు భట్టి (Bhatti) మీడియాతో మాట్లాడనున్నారు. కాగా, బడ్జెట్ సమావేశా (Budget meetings) ల్లో బీఆర్ ఎస్ శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ (KCR) కూడా హాజరుకానుండడం ఆసక్తిగా మారింది. ప్రతిపక్ష హోదాలో తొలిసారి కేసీఆర్ అడుగుపెడుతుండడంతో ఉత్కంఠగా మారింది. సమావేశాలకు హాజరైన అనంతరం అసెంబ్లీ నుంచి బీఆర్ ఎస్ బృందం కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram project) పర్యటనకు వెళ్లనుంది.
—————-