* రజతోత్సవ సభ ఏర్పాటు, కార్యక్రమాలపై దిశానిర్దేశం
ఆకేరున్యూస్, హైదరాబాద్: హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని తన నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ రజతోత్సవ కార్యక్రమాలపై బీఆర్ఎస్ నేతలతో చర్చించారు. వరంగల్లో ఏర్పాటు చేయబోయే మహాసభకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదని, హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలని ఎప్పటికప్పుడూ ఎంగడుతూ..ప్రజలకు అండగా ఉండాలని బీఆర్ఎస్ నేతలకు అధినేత కేసీఆర్ తెలిపినట్టు సమాచారం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై కూడా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలను బీఆర్ఎస్ నేతలు అధినేత కేసీఆర్కు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై కూడా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
