* జడ్జిని మార్చాలని ప్రభుత్వానికి సీజే ఆదేశాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ (Electricity Commission) పై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) చేసిన న్యాయ పోరాటం ఫలించింది. విద్యుత్ కొనుగోలు (Purchase of electricity) పై మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ (Petition) పై సుప్రీం (Supreme) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈకేసును స్వయంగా విచారించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ (Supreme Court Chief Justice Chandrachud) ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు విన్నారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కమిషన్ ఛైర్మన్ (Chairman of Electricity Commission) ప్రెస్మీట్ పెట్టడాన్ని సీజేఐ (CJI) అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషన్ ఛైర్మన్ తన అభిప్రాయాలు ఎలా వ్యక్తం చేస్తారంటూ సీజేఐ ప్రశ్నించారు. పవర్ కమిషన్కు మరొక జడ్జిని నియమించాలని సీజేఐ ఆదేశించారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా, నిష్పక్షపాతంగా కనిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. కమిషన్ విచారణ చేస్తున్న జడ్జిని మార్చాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం కొత్త జడ్జి (New judge) పేరును సుప్రీంకోర్టుకు వెల్లడించనుంది.
—————————