
ఆకేరు న్యూస్ హైదరాబాద్ఃప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి శివశక్తి దత్తా సోమవారం రాత్రి కన్ను మూశారు. మణికొండలోని తన నివాసంలో సోమవారం రాత్రి శివశక్తి దత్తా తుదిశ్వాస విడిచారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్,శివశక్తి దత్తా కు సోదరుడు . శివశక్తి దత్తా పలు చిత్రాలకు రైటర్ గా పనిచేశారు. రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చకున్నారు. శివశక్తిదత్తా మృతితో టాలీ వుడ్ లో విషాదం చోటుచేసుకుంది. చిత్రసీమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు మణికొండలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పిస్తున్నారు.
………………………………………….