* చికాగో కాల్పుల్లో విద్యార్థి మృతి
ఆకేరున్యూస్, ఖమ్మం: అమెరికాలో తుపాకీ తూటాకు మరో తెలుగు విద్యార్థి సాయితేజ బలయ్యాడు. చికాగోలో ఎంఎస్ చదవడానికి నాలుగు నెలల క్రితమే యూఎస్ వెళ్లినట్లు తెలిసింది. దుండగులు జరిపిన కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 26 ఏళ్ల సాయి తేజ అనే విద్యార్థి మరణించాడు. అతడు ఖమ్మం రూరల్ జిల్లా రామన్నపేట్కు చెందిన వాడిగా గుర్తించారు. కాగా, కాల్పులకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
………………………………..