ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బుర్రా వెంకటేశం(BURRA VENKATESAM) నియమితులయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 2న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. బుర్రా వెంకటేశం ఫైల్ పై తెలంగాణ గవర్నర్ సంతకం చేశారు. ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) చైర్మన్ గా ఉన్న మాజీ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి(MAHENDER REDDY) పదవీకాలం డిసెంబర్ 3తో ముగియనుండడంతో కొత్త ఛైర్మన్ నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశానికి ఆ అవకాశం కల్పించింది. ఐఎఎస్ అధికారిగా ఉన్న వెంకటేశం వీఆర్ఎస్ తీసుకోనున్నారు. వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత వెంకటేశం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
