ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం అత్తను, ఆస్తి కోసం తల్లి, తోబుట్టువుల హత్య.
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సెల్‌ఫోన్ కోసం ఇద్దరు దుండగులు ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపేశారు. హైదరాబాద్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని గుడిమల్కాపూర్‌లో పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 65 వద్ద రోడ్డు పక్కన వ్యాపారం చేసే సనా వుల్లా(24) వద్దకు వచ్చిన ఇద్దరు దుండగులు వచ్చారు. సెల్‌ఫోన్ ఇవ్వాలని అడిగారు. సనావుల్లా ఇవ్వకపోవడంతో లాక్కునేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటించిన సనావుల్లాను కత్తితో ఛాతీపై పొడిచారు. అనంతరం దుండగులు మొబైల్ తీసుకొని బైక్‌పై పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
——————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
