
* కగార్ అంటేనే ఓ కార్పోరేట్
* అమిత్ షా చర్చలంటే భయపడుతున్నాడు
* సీపీఐ నారాయణ హాట్‌కామెంట్స్
ఆకేరు న్యూస్, జనగామ : నక్సలైను చంపితే నక్సలిజం పోదని, నక్సలైట్లు శాంతి చర్చలు ప్రతిపాదనలు పెడితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా భయపడుతున్నాడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాట వేసి ఘన నివాళీ అర్పించారు. ఆఫరేషన్ కాగార్ అంటేనే ఓ కార్పోరేట్ అని, నక్సలైట్లతో చర్చలు అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెదిరిపోతున్నాడని. అటవి సంపదను, సహాజ వనరులను కార్పోరేట్ కంపెనీలకు దోచిపెటేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను చంపుతున్నారని అన్నారు. అడవుల్లో ఉన్నగిరిజనులు అడవులను వదిలి పోవాలని, నక్సలైట్లు అడవుల్లో నుంచి వెళ్ళలని ఆపరేషన్ కగార్ చేపట్టారని అన్నారు. నక్సలైట్ల చర్చలు సిద్దమని కాల్పుల విరమణ చేస్తే నేర చరిత్ర కలిగిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నక్సలైట్లను చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నాడని అన్నారు. నక్సలైట్లతో చర్చలు జరుపకుండా అమిత్ షా భయపడుతున్నాడని అన్నారు. నక్సలైట్లను అమిత్ షా చంపుతాడామే కాని, నక్సలిజాన్నిచంపలేడని, సిద్దాంతాలను చంపలేడని అన్నారు. నిజాం నవాబు లాంటి వారే కమ్యూనిస్టు సిద్దాంతం ముందు ఓడిపోయారని, ఎంతమంది అమిత్ షాలు వచ్చినా నక్సలిజాన్ని, దాని సిద్దాంతాన్ని చంపలేరని అన్నారు. దేశంలో పోరాటం సాగించాలంటే ఎర్రజెండా పార్టీలన్ని ఏకం కావాలని పిలుపునిచ్చారు. నక్సలైట్లే కేవలం తుపాకులు పట్టుకోలేదని గుర్తు చేశారు. మణిపూర్‌లో రెండు వర్గాలకు తుపాకులు ఇచ్చింది సర్కారే అని, నాగాలకు తుపాకులు ఇచ్చారని అన్నారు. టెర్రరిస్టుల వద్ద తుపాకులు లేవా అని నక్సలైట్ల తుపాకుల్లో బుల్లెట్లు, టెర్రరిస్టుల తుపాకుల్లో గులాబీ పువ్వులు, మల్లేపూలు వస్తున్నాయా అని ప్రశ్నించారు. మొదట నక్సలైట్లు తరువాత వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులే బీజేపీ టార్గెట్ చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యన్ని, భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నదని అన్నారు. దేశవ్యాప్తంగా వామపక్ష, ప్రజాసంఘాలు, నక్సలైట్లపై జరుగుతున్న హత్యాకాండను, దాడులను కేంద్ర ప్రభుత్వం ఆపాలని, ప్రజా సంఘాలు ప్రశ్నించాలని అన్నారు. నారాయణ వెంట విమలక్క తదితరులు ఉన్నారు.
………………………………………………….