
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ కింగ్ఫిషర్ బీర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. రాష్ట్రంలో కింగ్ఫిషర్, హెన్కిన్ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు వాటి తయారీ సంస్థ అయిన యునైటెడ్ బ్రేవరీస్ వెల్లడిరచింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల అనంతరం బీర్ల సరఫరాలపై తన నిర్ణయాన్ని ప్రకటించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలపడంతో వినియోగదారులు, కార్మికులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ వెనక్కి తగ్గినట్లు యునైటెడ్ బ్రేవరీస్ తెలిపింది. ప్రభుత్వ హామీతో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు, బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది.
………………………………………