ఆకేరున్యూస్, హైదరాబాద్: దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్తుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు సీఎంలు మంత్రులు హాజరయ్యారు. మంత్రులతో కలిసి దావోస్ పర్యటనకు వెళ్లిన సమయంలో అరుదైన కలయిక జరిగింది. జ్యూరిచ్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం.. అదే ఎయిర్పోర్టులో అప్పటికే అక్కడ ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. తెలుగు రాష్ట్రాల ఇద్దరు సీఎంలు, మంత్రులు ఒకేచోట కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిత్రంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, శ్రీథర్ బాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహననాయుడు ఉన్నారు. మంత్రి శ్రీథర్ బాబు భుజంపై చేతులేసి.. షేక్ హ్యాండ్ ఇస్తున్నారు సీఎం చంద్రబాబు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
