Konda Laxman Bapuji
Konda Laxman Bapuji| ఆకేరు న్యూస్, కమలాపూర్: తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను కమలాపూర్ మండల కేంద్రంలో పట్టణ పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కమలాపూర్‌లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసి కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ పద్మశాలి యూత్ అధ్యక్షుడు ఆడెపు శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ, స్వాతంత్ర్య, సాయుధ పోరాటాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేశారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఇల్లు, ఆస్తులను అంకితం చేశారని పేర్కొన్నారు. ప్రజా హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, బీసీ కులాల అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేశారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బైరి జనార్ధన్, పద్మశాలి పట్టణ కుల సంఘం అధ్యక్షుడు బైరి దశరథం, పద్మశాలి యూత్ ప్రధాన కార్యదర్శి మార్గం చైతన్య కుమార్, ఉపాధ్యక్షుడు తుమ్మ రాజేష్, క్యాషియర్ చెనుమల్ల శ్రీకాంత్, కార్యదర్శులు చేరాలా సాయికిరణ్, ఆడెపు వినయ్, డైరెక్టర్లు ఉడుత సురేష్, బూర రాజు, గాజుల అరుణ్, చెనుమల్ల రంజిత్, తుమ్మ రఘుపతి, చందనాల నాగరాజ్, బైరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
అలాగే సహకార సంఘం డైరెక్టర్లు చేరాలా సారంగం, చేరాలా వెంకట్రాజ్యం, వావిలాల మురళి, బైరి రాజేష్, వెల్ది రాఘవులు, ఆడెపు సాంబయ్య, చేరాల కిషన్, మార్త విజయ్‌తో పాటు పెద్ద సంఖ్యలో చేనేత కులస్తులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
