* సోషల్‌మీడియాలో వీడియో వైరల్
ఆకేరు న్యూస్. హైదరాబాద్ : ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో హాట్ టాపిక్ గా ఉండే మంత్రి కొండా సురేఖ ఇప్పుడు క్రికిట్ బ్యాట్ పట్టుకొని సోషల్ మీడియాలో కన్పిస్తోంది. కాకపోతే సిక్స్‌లు,ఫోర్లు కొట్టకుండా క్లీన్ బౌల్డ్ కావడం విశేషం. ఈ సరదా సన్నివేశం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎకో ఫారెస్ట్ టూరిస్ట్ పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా పార్క్ ను ప్రారంభించడానికి వచ్చారు. ఈ క్రమంలో అక్కడు యువకులు క్రికెట్ ఆడుతుండగా మంత్రి సరదాగా బ్యాట్ తీసుకొని బ్యాటింగ్ కు దిగారు. యువకుడు వేసిన బంతిని బౌండరీ తరలించాలనుకునే లోపలే మంత్రి క్లీన్ బౌల్డ్ అయ్యారు. మంత్రి ఒకటే బాల్ కు క్లీన్ బౌల్డ్ కావడంతో అక్కడున్న వారితో పాటు మంత్రి కూడా సరదాగా నవ్వుకున్నారు.
…………………………………………..
