– నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా .. లేదంటే తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ క్షమాపణ చెప్పాలి
– హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, హుజురాబాద్ : తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ తనపై చేసిన ఆరోపణలలో వాస్తవం లేదనీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. కరీంనగర్ సీపీ ని మత మార్పిడి చేస్తున్నట్టు అన్నట్లు తన మాటలను వక్రీకరించారని, తాను ఆ మాటలు అన్నట్టు నిరూపించాలని తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ కి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ,లేదంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు క్షమాపణ చెప్పాలని, క్షమాపణ చెప్పుకుంటే, ప్రి విలేజ్ మోషన్ మూవ్ చేస్తా అని ఆయన వీడియోలో పేర్కొన్నారు.
కాగా నిన్న సాయంత్రం కరీంనగర్ సీపీ పట్ల తాను చేసిన వ్యాఖ్యలకు పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పారు. తాను ఉద్దేశ పూర్వకంగా అన్న మాటలు కాదని వివరణ ఇచ్చారు. నా మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను.అని సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు.

………………………………………..
