* సీఎం రేవంత్ ఓ నిక్రుష్టుడు
* రాహుల్ గాంధీని ఉరి తీయాలి
* తెలంగాణ భవన్లో కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు కుక్కమూతి పిందలు అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో మాజీ మంత్ర హరీష్ రావు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వాళ్లు కుక్కమూతి పిందలు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సర్వభ్రష్ట ప్రభుత్వానికి అధినేత రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డి ఓ నికృష్టుడు అంటూ కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇంత చెత్త ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదంటూ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేల్చి వేతలు, కూల్చి వేతలు ఎగవేతల ప్రభుత్వం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మేడి గడ్డను బాంబులతో కూట్చారని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చి వేస్తున్నారంటూ విమర్శించారు. రైతులకు రుణాలు ఇవ్వకుండా ఎగ వేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి బచావత్ ట్రిబ్యునల్ కు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు ఉన్న తేడా తెలియదని కేటీఆర్ అన్నారు.
రాహుల్ గాంధీని ఉరి తీయాలి
రాహుల్ గాంధీని ఉరి తీయాలంటూ కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిరద్యోగులను మోసం చేసినందుకు రాహుల్ గాంధీని అశోక్ నగర్ చౌరస్తాలో ఉరి తీయాలని, రైతులను మోసం చేసినందుకు వరంగల్ లో ఉరి తీయాలని బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేసినందుకు రాహుల్ గాంధీని కామారెడ్డిలో ఉరితీయాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు 420 హామీలు ఇచ్చి మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీని 420 సార్లు ఉరితీయాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

