* బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం తథ్యం
* 2025లో కేసీఆర్ యాక్టివ్ అవుతారు
* ఆస్క్ కేటీఆర్ ద్వారా వెల్లడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో త్వరలోనే పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Brs working President Ktr) వెల్లడించారు. కాంగ్రెస్(Congress) వైఫల్యాలను ఎండగడతానని వివరించారు. ట్విటర్ (ఎక్స్) వేదిగా నిర్వహించిన ‘ఆస్క్ కేటీఆర్’ (Ask Ktr)క్యాంపెయిన్లో ఈమేరకు యూజర్లు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కాంగ్రెస్ అధికారం చేపట్టడం తెలంగాణకు శాపమని, ఆ పార్టీ చేసే నష్టం నుంచి తెలంగాణను బాగుచేయడం కష్టమని విమర్శించారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం తథ్యమన్నారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా, దృడంగా ఉన్నారని, 2025లో రాజకీయంగా మరింత యాక్టివ్ అవుతారని వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇచ్చారని చెప్పారు. రాష్ట్రం ఉన్నన్ని రోజులు, తెలంగాణ పదం ఉన్నన్ని రోజులు కేసీఆర్(Kcr) పేరు నిలిచే ఉంటుందన్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కొత్తగా ఎన్నికైన ఈ ప్రభుత్వానికి ఇచ్చిన 420 హమీలు అమలు చేసేందుకు సరిపడా సమయం ఇచ్చారన్నారు. నూతన సంవత్సరం తర్వాత ఆయన నుంచి మరిన్ని కార్యక్రమాలను చూస్తామన్నారు.
* రైతులను పట్టించుకోని రేవంత్ రెడ్డి
ఎన్నికల్లో రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు. రైతు బంధు, రైతు భరోసా గురించి మాట్లాడడమే మానేశారన్నారు. అకాల వర్షాలకు పంటలు తడిసి ముద్దవుతున్నా కొనుగోలు చేసే నాధుడే కరవైనాడని కేటీఆర్ అన్నారు. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నా సీఎం రేవంత్ రెడ్డి డైవర్సన్ పాలిటిక్స్ తో కాలం గడుపుతున్నారని కేటీఆర్ విమర్శించారు.
—————————–