* ట్రావెల్ బస్సు.. ఆర్టీసీ బస్సు ఢీ : 30 మందికిపైగా గాయాలు
ఆకేరు న్యూస్, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా(Suryapeta District)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎవరికీ ప్రాణాపాయం లేకపోయినా ఏకంగా 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. హైదరాబాద్(Hyderabad) నుంచి విజయవాడ(Vijayawada) వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సును జిల్లాలోని కోదాడ(kodada) వద్ద జాతీయ రహదారిపై డ్రైవర్ పక్కకు ఆపాడు. అదే సమయంలో బీహెచ్ఈఎల్ (Bhel)డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుంచి దానిని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికిపైగా గాయాలపాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు బస్సు వెనక, ఆర్టీసీ బస్సు ముందు భాగం బాగా ధ్వంసమయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
