PV Knowledge Centre Director DR V SATYANARAYANA
ఆకేరు న్యూస్ , హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీ (KAKATIYA UNIVERSITY) పీవీ నాలెడ్జ్ సెంటర్ డైరెక్టర్గా రాజనీతి శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వడ్లకొండ సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ కె. ప్రతాపరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం మీదికొండ గ్రామానికి చెందిన డాక్టర్ సత్యనారాయణ.. రాజనీతి శాస్త్ర విభాగంలో గత 20 ఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నారు. ఈ కాలంలో ఆయన పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పరిశోధన పత్రాలను సమర్పించారు.
* పలువురి హర్షం
డాక్టర్ సత్యనారాయణ (DR V Satyanarayana) నియామకం పట్ల కాకతీయ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. రాజనీతి శాస్త్ర విభాగ అధిపతి, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ కృష్ణయ్య, డాక్టర్ వెంకటయ్యలతో పాటు కాంట్రాక్ట్ అధ్యాపక సంఘం నేతలు డాక్టర్ సాదు రాజేష్, డాక్టర్ బి. సతీష్ తదితరులు ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు.
————————
