Rajaiah Protest Against Deputy CM Bhatti Visit
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటనను అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ రేపటి కల్లాలలో ధాన్యం కుప్పలుగా ఉన్నాయి, మక్క జొన్నలు ఎక్కడ కొనలేదు తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులు తిరగబడతారనే భయంతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం పర్యటన వాయిదా వేయించాడని ఆరోపించారు. . కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 870 మంది రైతులు చనిపోయారు, యూరియా అందక కొందరు చనిపోతే మరికొందరు రైతు భరోసా అందక కొందరు చనిపోయారు వారిని పట్టించుకునే నాధుడు లేడు అన్నారు. స్టేషన్ ఘనాపూర్ నియోక వర్గంలో 13 సబ్ స్టేషన్లు సాంక్షన్ కాగా, 13 తో పాటు పీసర, కొండాపూర్, కుర్చపల్లి, సాగరం మొదలకు సబ్ స్టేషన్లు నేను మంజూరు తెచ్చాను అన్నారు పల్లగుట్ట లో జరగబోయే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కార్యక్రమాన్ని అడ్డుకోవాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే రాజయ్య పిలుపు ఇచ్చారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
