
* దాదాపు రూ.2 లక్షల కోట్లు వచ్చే అవకాశం
ఆకేరున్యూస్, ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్లో మహా కుంభమేళా ప్రారంభమైంది. తొలి రోజు ఉదయం గంగా , యమునా, సరస్వతి నదులు కలిసిన త్రివేణి సంగమం వద్ద దాదాపు 50 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ప్రపంచంలోనే అత్యధిక మంది సమ్మేళనమైన కార్యక్రమంగా ఈ మహా కుంభమేళా రికార్డుల్లోకి ఎక్కనుండగా.. ఈ కుంభమేళాకు దాదాపుగా 45 కోట్ల మందికిపైగా భక్తులు తరలివస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇది అమెరికా, రష్యా దేశాల జనాభా కంటే కూడా ఎక్కువ కావడం గమనార్హం. కుంభమేళా ప్రతి పన్నేండేళ్లకు ఒకసారి జరుగుతుండగా.. ఇప్పుడు జరిగేది మహా కుంభమేళా. ఈ మహా కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఇవాళ ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఈ 45 రోజుల మహా కుంభమేళా నిర్వహణకు యూపీ సర్కారు రూ.7 వేల కోట్ల బడ్జెట్ను కేటాయించింది. అయితే మహా కుంభమేళాకు రూ.7 వేల కోట్లు ఖర్చు చేస్తే.. యూపీకి ఆదాయం రూపంలో దాదాపు రూ.2 లక్షల కోట్లు వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
………………………………..