
* టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరిక
ఆకేరున్యూస్, అమరావతి: తిరుపతిలో ఈ నెల 8వ తేదీన అత్యంత దురదృష్టకరమైన సంఘటన జరిగిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. అలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తిరుమలలో సోమవారం బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. బోర్డు సభ్యులతో ఏర్పాటు చేసిన రెండు బృందాలు బాధితులకు పరిహారం అందజేశారని పేర్కొన్నారు. టీటీడీపై కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని.. తిరుమల అనేది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయమని తెలిపారు. వార్త ప్రచురణ, ప్రసారం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని కోరారు. ఇష్టానుసారం చేతిలో మీడియా ఉందని ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీటీడీ పాలక మండలికి, అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను బీఆర్ నాయుడు తీవ్రంగా ఖండిరచారు.
………………………………………………