
* సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ ః రైతులకు ఎవరేం చేశారో తేల్చకుందాం రా అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. శనివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అవసరం లేదని తాను సరిపోతానని కేటీఆర్ అన్నారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చేసినట్లుగా దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదని కేటీఆర్ అన్నారు.బనకచర్లతో గోదావరి నీళ్లను ఆంధ్రాకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలు విస్మరించి ఆంధ్ర వాళ్లకు సహాయం చేస్తున్నాడని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు అని పోరాడితే
సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నీళ్లు ఆంధ్రాకు మళ్లిస్తున్నారని ,నిధులను ఢిల్లీకి నియామకాలను ఆయన బంధువులకు పంచుతున్నారని కేటా ఆర్ ఆరోపించారు.ఆంధ్రాకు హారతి పట్టి నీళ్లును ఇచ్చింది కాంగ్రెస్ వారేనని కేటీఆర్ అన్నారు. రైతులకు ఎరువులు పంపిణీ చేయలేని అసమర్థ ప్రభుత్వం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కి 72 గంటల టైం ఇస్తున్నాని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సీఎం రేవంత్ తో తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ ప్రిపేర్ అయి రావాలని సలహా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వంద సీట్టు గెలుస్తుందనడాన్ని కేటీఆర్ ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ ఒక్క జెడ్పీటీసీని కూడా గెలవదని కేటీఆర్ జోస్యం చెప్పారు.
………………………………………………..