
* ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది
* ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు చేపడతాం.
* మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
ఆకేరు న్యూస్ ములుగుః ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో అంతర్గత సి.సి. రోడ్ల నిర్మాణము అంచనా విలువ రూ॥ 55.00 లక్షల పనులను, ఎన్ హెచ్ 163 చిన్నబోయినపల్లి నుండి పెద్ద వెంకటాపూర్ వరకు ఒక కోటి 60 లక్షల నిధులతో బిటి రోడ్డు నిర్మాణం, షాపల్లి గ్రామం లో 70 లక్షల నిధులతో అంతర్గత రోడ్ల నిర్మాణాన పనులకు మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలసి శంకుస్థాపన చేశారు.చిన్నబోయిన పల్లి నేషనల్ హైవే రోడ్డు మార్గంలో వనమహోత్సవం లో భాగంగా కలెక్టర్ తో కలసి మంత్రి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని అన్నారు. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయుటకు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, అందరు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములై ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.దహలవారిగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈ ఈ అజయ్ కుమార్, ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ వీర భద్రం,మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………………………