*కమ్యూనిస్టులకు రేవంత్ పిలుపు
*కమ్యూనిజం అంటే పుస్తకం కాదు
* రవీంద్రభారతిలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దేశం నేడు విపత్కర పరిస్థితులను ఎదుర్కొటోందని ఈ పరిస్థితుల్లో విపక్షాలు ఏకం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్రబారతిలో నిర్వహించిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. నేడు రాజ్యాంగాన్ని మార్చాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ఎన్నికల కమిషన్ కూడా మార్చాలనే కుట్ర జరుగుతోందని రేవంత్ అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని రక్షించే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. రాహుల్ చేస్తున్న పోరాటాని మద్దతు తెలిపి ఆయన వెంట నడుద్దాం అని రేవంత్ కమ్యూనిస్టులను కోరారు. కమ్యూనిజం అనేది ఓ సిద్దాంతం అని దాని ఆలోచనా పరిధి పెరగాలని సీఎం అన్నారు, కమ్యూనిజం అంటే లైబ్రరీలో లభించే పుస్తకం కాదని రేవంత్ అన్నారు.దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టులది మరువలేని పాత్ర అని రేవంత్ అన్నారు. కేంద్రంలో ప్రభుత్వాలు పడిపోవడానికి కారణం కమ్యూనిస్టులే నని రేవంత్ అన్నారు. నేడు బీహార్ లో 65 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని రేవంత్ అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి నైతిక విలువలకు కట్టుబడిన నాయకుడని రేవంత్ అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి శాశ్వతంగా గుర్తుండి పోయేలా ఉండేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు రేవంత్ తెలిపారు. పాలమూరు బిడ్డగా హామీ ఇస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
………………………………………………..
