* పెట్టుబడులే లక్ష్యంగా ప్రముఖులతో భేటీ
* మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్లతో చర్చలు
ఆకేరున్యూస్, అమరావతి: పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పలువురు ప్రముఖులను కలిసి చర్చిస్తున్నారు. తాజాగా రెండ్ మండ్‌లో మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్లతో పాటు శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్‌తో భేటీ అయిన లోకేష్… ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతోందనీ, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులకు అన్నివిధాల అనుకూలమైన ప్రాంతమని చెప్పారు. ముందుగా సత్య నాదెళ్లతో జరిగిన సమావేశంలో క్లౌడ్`ఆధారిత ప్లాట్‌ఫామ్‌లను అమలు చేయడం, డేటా అనలిటిక్స్ కోసం ఏఐని ఉపయోగించడం, సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడం, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రో సాప్ట్ సహకారాన్ని అందించాలని లోకేష్ కోరారు.
ఏఐ ప్రాజెక్టులకు అనువుగా ఉన్న అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా తయారు చేయాలని భావిస్తున్నామని, ఇందులో భాగంగా అమరావతి లో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని లోకేష్ వివరించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, డైనమిక్ టెక్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాల్సింది గా కోరారు. ఏపీలో నెలకొన్న మౌలిక సదుపాయాలు, సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఒకసారి మా రాష్టాన్రికి వచ్చి పరిశీలించమని కోరిన లోకేష్ ఏపిలో పెట్టుబడులకు గల అవకాశాలను పరిశోధించాలని, ఆంధప్రదేశ్ సమగ్రాభివృద్ధి ప్రణాళికల్లో అధునాతన సాంకేతికను ఏకీకృతం చేయడానికి భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ మైక్రోసాప్ట్ సీఈఓను కోరారు. లోకేష్‌తో భేటీ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ మైక్రోసాప్ట్ సంస్థ సాప్ట్వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా ఉందని చెప్పారు. అనంతరం శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ కంపెనీ సీఈవో శంతను నారాయణ్‌తో లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శంతను నారాయణన్ మాట్లాడుతూ అడోబ్ కంపెనీ ప్రస్తుతం డిజిటల్ విూడియా, క్లౌడ్`ఆధారిత సేవల్లో అగ్రగామిగా ఉంది.
ఫోటోషాప్, అక్రోబాట్, ఇల్లస్టేట్రర్ వంటి సాధనాలను మరింత అందుబాటులోకి తెచ్చామని, సృజనాత్మకత, డాక్యుమెంట్ ఉత్పాదకత, ఏఐ`పవర్డ్ ఇన్నోవేషన్స్ రంగంలో ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ వెర్షన్స్ ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. అలాగే శాన్ఫ్రాన్సిస్కోలోని యాపిల్ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) ప్రియా బాలసుబ్రహ్మణ్యాన్ని కలిశారు. యాపిల్ యాక్టివిటీస్ విస్తరించడానికి ఏపీ అనుకూలమైన ప్రాంతంగా చెప్పుకొచ్చారు. ఆంధప్రదేశ్‌లో కోరిన చోట స్థలం ఇస్తామని తెలిపారు. తయారీ యూనిట్ స్టార్ట్ చేయాలని ఆహ్వానించారు. కావాల్సిన ప్రాంతంలో భూమితో పాటు కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. అత్యంత నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఉన్నాయని వాళ్లకు వివరించారు. ఏపీతో కలిసి పని చేసేందుకు ప్రియా సుబ్రహ్మణ్యం సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు.
…………………………………………………..