Lovlina Borgohain
Published:
Updated: 02 Oct 2026 • 12:26 PM
భారత్ ఖాతాలో 70 పతకాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఆసియా క్రీడల్లో భారత్కు మరో బంగారు పతకం దక్కింది. మహిళల 75 కిలోల బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ స్వర్ణ పతకం సాధించారు. ఫైనల్ పోరులో చైనాకు చెందిన ప్రత్యర్థిని ఓడించి లవ్లీనా ఈ ఘనతను అందుకున్నారు.
లవ్లీనా గెలుపుతో ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 70కి చేరింది. ఇందులో 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్య పతకాలు ఉన్నాయి. తాజా స్వర్ణంతో పతకాల పట్టికలో భారత్ ఆరో స్థానానికి చేరుకుంది.
భారత బాక్సింగ్ నుంచి లవ్లీనా మరోసారి అద్భుత ప్రదర్శన కనబరచడంతో దేశవ్యాప్తంగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

కరస్పాండెంట్
ఇనుగాల కిశోర్ , MA (Mass Communication )
12 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
