
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మద్దాలి నాగమణి కి నియామక పత్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనుసరి అనసూయ ( సీతక్క) కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ లు అందజేశారు. తాడ్వాయి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అభివృద్ధి కొరకు కృషి చేసే ప్రతి ఒక్క కార్యకర్తకు తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుంది అని, దానికి నిదర్శనం మద్దాలి నాగమణి కి ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవి లభించడమే ఉదాహరణ అని చెప్పారు, ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్ధితో పని చేస్తే ఉన్నత పదవులు తప్పక లభిస్తాయని తెలియజేశారు. అలాగే నూతనంగా ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన మద్దాలి నాగమణి కి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, ఆదర్శాలకు అంకితమై, నీతి, నిజాయితీ, నిబద్దత, క్రమశిక్షణ, చిత్తశుద్ధితో వ్యవహరించి, సహచర కార్యకర్తలు, పార్టీ కమిటీలతో కలిసి అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి జిల్లా వ్యాప్తంగా పార్టీని అన్ని రంగాలలో పటిష్ట పరిచి మరింత విస్తరించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన మద్దాలి నాగమణి మాట్లాడుతూ ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్టీ అభ్యున్నతికి, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా అహర్నిశలు కృషి చేస్తానని పార్టీ సమావేశాలకు అందుబాటులో ఉండి, కాంగ్రెస్ పార్టీ పథకాలను నిజమైన అర్హులకు అందజేసేలా కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు పని చేసి అభివృద్ధి పథంలో నడుపుతానని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు నా శక్తి మేరకు పని చేస్తానని తెలియజేశారు. నియామకానికి కృషి చేసిన మంత్రి దనసరి సీతక్క, పైడాకుల అశోక్ , ములుగు మార్కెట్ కమిటి చైర్మన్ రేగ కళ్యాణి , గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ , గోవిందరావుపేట మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు మరియు మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.
……………………………………………..