
* ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి సొంత ఖర్చుతో..
ఆకేరు న్యూస్,తొర్రూరు : తొర్రూరు మండలం మడిపెల్లి గ్రామ చెరువుకు గండ్లు పడిన కారణంగా మరమ్మతు చేయించడానికి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ముందుకు వచ్చారు. తన స్వంత ఖర్చుతో చెరువు మరమ్మతు పనులను ఆమె బుధవారం ప్రారంభించారు. ఉప్పరివాని కుంట చెరువుకు రెండు ప్రదేశాల్లో గండ్లు పడటంతో చెరువులో నిల్వ ఉన్న నీరు వృథా అయిపోతోంది. దీంతో పంటలు నష్టపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు ఎమ్మెల్యే గారిని కలిసి కోరారు. సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మడిపెల్లి గ్రామానికి స్వయంగా వచ్చి పరిస్థితిని పరిశీలించారు. వెంటనే చెరువు మరమ్మతు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి మాట్లాడుతూ రైతుల బాధలు తనకు బాగా తెలుసు అని అన్నారు. ప్రభుత్వం సహాయం ఆలస్యం అయితే, నా స్వంత ఖర్చుతో అయినా ఈ చెరువును మరమ్మతు చేయిస్తాను. ఇది ప్రజా నాయకురాలిగా నా బాధ్యత” అని అన్నారు..టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది ప్రజల పట్ల ఒక నిజమైన నాయకత్వం ఎలా ఉండాలో చూపిస్తున్న ఉదాహరణ. రైతులు నమ్మే నాయకురాలు యశస్విని రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షాన నిలుస్తుంది” అని అన్నారు..ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ బ్లాక్ మండల నాయకులు, గ్రామస్థులు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువజన ప్రతినిధులు పాల్గొన్నారు.
…………………………………..