* జూబ్లీహిల్స్‌లో అత్యంత ఎక్కువ ఆయనకే
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హిస్టరీలు క్రియేట్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రికార్డు స్థాయిలో 50 శాతానికి మించి ఓట్లు రాగా, ఆ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్ భారీ మెజారిటీ సాధించారు. నియోజకవర్గంగా జూబ్లీహిల్స్ ఆవిర్భవించిన తర్వాత ఇదే అత్యంత భారీ మెజారిటీ కావడం మరో రికార్డు. ఖైరతాబాద్ నియోజకవర్గ పునర్విభజనలో 2008లో ఓ అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. 2009లో నియోజకవర్గానికి తొలి సారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన విష్ణువర్ధన్‌రెడ్డికి టీడీపీ అభ్యర్థి మహ్మద్ సలీంపై గెలిచి 21,731 మెజారిటీ పొందారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో లో కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం పోటీ పడ్డాయి. ప్రస్తుత విజేత, అప్పటి ఎంఐఎం అభ్యర్థి పి నవీన్‌యాదవ్ పై టీడీపీ తరఫున పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ 9,242 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డి మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు. 2018 అసెంబ్లీ బీఆర్ఎస్ నుంచి నిలబడ్డ మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్ అభ్యర్థి పి విష్ణువర్ధన్‌రెడ్డి పై 16,004 ఓట్లతో గెలిచారు. నవీన్‌యాదవ్‌కు ఎంఐఎం టికెట్టు ఇవ్వడానికి నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌పై 16,337 ఓట్ల మెజారిటీ సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నవీన్‌యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఇదే భారీ మెజారిటీ కావడం గమనార్హం.
………………………………………………..
