Mamunur Airport
* 2500 మీటర్ల రన్‌వేతో అభివృద్ధి..
* టెండర్లలో స్పష్టత
Mamunur Airport| ఆకేరు న్యూస్, వరంగల్: చారిత్రాత్మక వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టును డొమెస్టిక్ విమానాశ్రయంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు వేగం పుంజుకున్నాయి. తాజాగా జారీ చేసిన టెండర్లలో మామునూరును పూర్తి స్థాయి డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుగా పేర్కొంటూ అధికారులు స్పష్టత ఇచ్చారు.
ఏ-320 విమానాలకు అనుగుణంగా
ఎయిర్‌పోర్టులో ఏ-320 (కోడ్ సీ) విమానాలు ల్యాండ్ అయ్యేలా 2500 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్‌వే నిర్మించనున్నారు. టెర్మినల్‌లో 12 చెక్-ఇన్ కౌంటర్లు, ఒకేసారి 850 మంది ప్రయాణికులు కూర్చునే సదుపాయం కల్పించనున్నారు.
పార్కింగ్, లాంజ్‌లతో ఆధునిక వసతులు
ప్రయాణికుల కోసం 2 సెక్యూరిటీ చెక్ పాయింట్లు, ఒక VIP, ఒక CIP లాంజ్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే సుమారు 200 కార్లు, 100 ట్యాక్సీలు నిలిపేలా పార్కింగ్ సౌకర్యం, లగేజ్ కోసం 2 కన్వేయర్ బెల్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు. మామునూరు ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే వరంగల్‌తో పాటు ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాల అభివృద్ధికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
