* ఎన్ కౌంటర్లో 29 మంది మృతి
* భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం
* కీలక నేత శంకర్రావు మృతి
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : చత్తీష్ గఢ్ లో పోలీసులకు మావోయిస్ట్ లకు( Maoists ) మద్య భీకర పోరు జరిగింది. అబూజ్ మడ్కు సమీపంలోని ,చోటేబైథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్ట్‌లకు పోలీస్‌లకు మద్య ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు నాలుగు గంటలే కొనసాగిన ఈ ఎన్ కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ కీలక నేతలు శంకర్ రావు సహా ఇతర ముఖ్య నేతలు మృతి చెందారు. శంకర్ రావు మీద చత్తీష్ గఢ్ ప్రభుత్వం రూ. 25 లక్షల రివార్డు ప్రకటించింది. ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఎల్ ఎంజీ తుపాకులతో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాదీనం చేసుకున్నామని ఎన్ కౌంటర్‌కు నేతృత్వం వహించిన ఐపీఎస్ అధికారి ఇందిర కళ్యాణ్ మీడియాకు తెలిపారు. లోక్ సభ పోలింగ్ ముందు భారీ సంఖ్యలో మావోయిస్ట్‌లు సమావేశమయి అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో కూంబింగ్ చేపట్టామన్నారు. . 70 మందికి పైగా మావోయిస్ట్‌లు ఉన్నారన్నది సమాచారం 250 మందికి పైగా పోలీస్ లు కూంబింగ్‌లో పాల్గొన్నారని ఐపీఎస్ అధికారి కళ్యాణ్ చెప్పారు. ఎన్ కౌంటర్లో ఒక బీఎస్ ఎఫ్ ఇన్స్పెక్టర్ , ఇద్దరు జవాన్లకు గాయాలయినాయి. చికిత్స కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించామని కళ్యాణ్ వివరించారు.
* మావోయిస్ట్ కీలక నేతలు మృతి..
ఎన్ కౌంటర్లో మావోయిస్ఠ్ పార్టీ కీలక నేతలు మృతి చెందినట్లుగా చెబుతున్నారు. శంకర్ రావు అనే కీలక నేత మృతి చెందాడని ఇతనిపై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించిందిని పోలీసులు తెలిపారు. శంకర్ రావు తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లాకు చెందిన వాడని చెబుతున్నారు. పోలీస్‌లు మాత్రం ఇంకా ధృవీకరించలేదు.
————————————
Related Stories
October 9, 2024
October 9, 2024