Mayukha Movie
* ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’!
* న్యూయార్క్, కేన్స్‌లో గుర్తింపు పొందిన చిత్రం..
ఆకేరు న్యూస్, సినిమా : భారీ బడ్జెట్ సినిమాలే కాదు.. బలమైన కథ, విభిన్నమైన కథనం ఉంటే చిన్న చిత్రాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగలవని నిరూపించిన సినిమా ‘మయూఖ’ (Mayukha Movie). దర్శకుడు శ్రీ తేజ్ SK తెరకెక్కించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని శశిధర్ నల్ల, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ నిర్మించారు.
థియేటర్లలో మంచి స్పందనతో పాటు న్యూయార్క్, కేన్స్‌లో అంతర్జాతీయ అవార్డుల గుర్తింపు పొందిన ఈ సినిమా.. ఇప్పుడు డిజిటల్ వేదికలపై అందుబాటులోకి వస్తోంది. ముందుగా నవంబర్ 20 అర్ధరాత్రి 12 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు వెర్షన్ మాత్రమే ప్రత్యేకంగా స్ట్రీమింగ్కు వచ్చింది. నవంబర్ 23 నుంచి తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు జియో హాట్‌స్టార్‌లోనూ అందుబాటులోకి రానుంది.
* ఫస్ట్ హాఫ్ స్లో బర్న్.. ప్రీ ఇంటర్వెల్ నుంచి అసలైన ఆట!
సినిమా కథనం గురించి దర్శకుడు శ్రీ తేజ్ SK ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ‘మయూఖ’ (Mayukha Movie) మొదటి భాగం స్లో బర్న్ నేరేషన్‌తో సాగుతుందని, మలయాళ సినిమాల్లో కనిపించే కథన శైలిని గుర్తు చేస్తుందని తెలిపారు. అయితే ప్రీ ఇంటర్వెల్ సమయానికి కథ అనూహ్యమైన మలుపు తీసుకుంటుందని చెప్పారు. అక్కడి నుంచి ఉత్కంఠ, వేగం పెరుగుతాయని, రెండో భాగం మరింత ఇంటెన్స్ థ్రిల్లర్ అనుభూతిని అందిస్తుందని వివరించారు.
* మోనోక్రోమాటిక్ లైటింగ్‌తో ప్రత్యేకమైన విజువల్ ట్రీట్మెంట్
ఈ సినిమాలో మరో ప్రత్యేకత విజువల్ ప్రెజెంటేషన్. సాధారణ సినిమాలకు భిన్నంగా మోనోక్రోమాటిక్ లైటింగ్ ప్యాటర్న్‌ను ఉపయోగించినట్లు దర్శకుడు తెలిపారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశానికి అనుగుణంగా ప్రత్యేకమైన విజువల్ లాంగ్వేజ్‌ను రూపొందించేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. స్పానిష్, హాలీవుడ్, కొరియన్ సినిమాల నుంచి స్ఫూర్తి పొందుతూ కథనం, సస్పెన్స్, విజువల్ ప్రెజెంటేషన్‌ను తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.
* ఒకే సిట్టింగ్‌లో చూడాలంటున్న దర్శకుడు
ఓటీటీలో ఈ సినిమాను చూడబోయే ప్రేక్షకులకు దర్శకుడు శ్రీ తేజ్ SK ఒక సూచన చేశారు. ‘మయూఖ’ను మధ్యలో ఆపకుండా ఒకే సిట్టింగ్‌లో పూర్తిగా చూడాలని కోరారు. అలా చూస్తేనే కథలోని సస్పెన్స్, సైకలాజికల్ అంశాలు, అనూహ్యమైన మలుపులను పూర్తిస్థాయిలో ఆస్వాదించగలరని అభిప్రాయపడ్డారు.
చిన్న బడ్జెట్‌తో రూపొందిన ‘మయూఖ’ అంతర్జాతీయ అవార్డుల గుర్తింపు నుంచి థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ వరకు తనదైన ప్రయాణాన్ని సాగించింది. ఇప్పుడు నాలుగు భాషల్లో ఓటీటీ విడుదలతో మరింత మంది ప్రేక్షకులకు చేరువ కానుంది. కొత్త తరహా కథనాలు, సైకలాజికల్ థ్రిల్లర్లను ఇష్టపడేవారికి ఈ సినిమా ఆసక్తికరమైన ఎంపికగా నిలవనుంది.
Also Read : ‘ఆకాశంలో ఒక తార’కు పది రెట్లు ఆదరణ!
Please tell us what is wrong. Your report will be sent to the website team.

