* మేడారం సమ్మక్క, సారక్కలను దర్శించుకున్న
రాష్ట్ర మంత్రి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
ఆకేరు న్యూస్, ములుగు: జనవరి 2026 చివరి వారంలో జరగబోయే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర పురస్కరించుకొని జాతర ఆవరణలో మాస్టర్ ప్లాన్ తో రాతి శిల్పాల నిర్మాణం పనులతో పాటు పరిసరాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను, నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సీతక్క సూచించారు. సోమవారం తాడ్వాయి మండలం లోని సమ్మక్క సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, దేవాలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలను,రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను,రాష్ట్ర మంత్రి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, ఆదేశించారు . మొదట ఆదివాసి ఆచార స్మృతి సాంప్రదాయాల ప్రకారం అమ్మవార్ల గద్దెలపై పసుపు కుంకుమ బంగారం (బెల్లం) సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ మర్యాదలతో పూజారులు మంత్రి, ఎమ్మెల్యే లను సత్కరించి ఘనంగా సన్మానించి అమ్మ వార్ల తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ,ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి ,పూజారులు సిద్దబోయిన భోజారావు, మేడారం నూతన సర్పంచ్ పీరిల భారతి వెంకన్న, జిల్లా, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………..

