రఘునందన్‌రావు
* ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలుసు
* బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు
ఆకేరు న్యూస్, మెదక్ : లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారతాయని ఆ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మళ్లీ రావడం ఖాయమన్నారు. రేవంత్ కొడంగల్ లో ఎమ్మెల్యేగా ఓడిపోయి.. మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారని, దుబ్బాకలో ఓడిన నేను మెదక్ నుంచి ఎంపీగా గెలవకూడదా అని ప్రశ్నించారు. నేను దుబ్బాకకు ఏం చేశానో.. ఒక పుస్తకం రాస్తాను అని వెల్లడించారు.
కాంగ్రెస్ కు పుట్టగతులుండవ్
బీఆర్ఎస్ లాగే వ్యవహరిస్తే కాంగ్రెస్ కు కూడా పుట్టగతులుండవ్ అని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ హెచ్చరించారు. కేసీఆర్ ను గద్దె దించడంలో బీజేపీయే కీలక పాత్ర పోషించిందని చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని చెప్పారు.
———————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
