Unidentified Man Found Dead Medaram
ఆకేరు న్యూస్, ములుగు:
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పరిసరాల లోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సుమారు 30 ఏళ్ల వయస్సు గల ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
నార్లాపూర్(మేడారం )ఎస్ఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం, స్థానికులు మృతదేహాన్ని గమనించి స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారని తెలిపారు. ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. మృతుడు కాఫీ రంగు ఫుల్ షర్ట్, నీలం రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఫోటోలో ఉన్న ఈ వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే నార్లాపూర్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలు తెలిసిన వారు 8712630131, 8712630132 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
