Irumudi Glimpse Release Raviteja
ఆకేరు న్యూస్, డెస్క్: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’పై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
* జూన్ 3న ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’
చిత్రబృందం తాజాగా ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ పేరుతో గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 3న ఈ గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకు రానుండగా, రవితేజ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
* అయ్యప్ప మాల.. తండ్రీకూతుళ్ల ఎమోషన్
ఈ చిత్రం కథలో అయ్యప్ప మాల నేపథ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే తండ్రీకూతుళ్ల మధ్య సాగే భావోద్వేగ బంధం కథకు ప్రధాన బలంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ విభిన్న కాన్సెప్ట్ కారణంగానే సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
* శివ నిర్వాణ-రవితేజ కాంబోపై ఆసక్తి
క్లాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్లను తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన శివ నిర్వాణ తొలిసారి రవితేజతో కలిసి పనిచేస్తున్నారు. దీంతో ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.
* షూటింగ్ చివరి దశలో..
ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తికాగా, త్వరలో విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
