* రహదారుల వెంబడి రంగవల్లులు, బలులు సమర్పించి అమ్మవారి రాక కోసం వివిధ కళారూపాల ద్వారా ప్రదర్శనలు.
*తన్మయత్వం లో మునిగిపోతున్న భక్తులు
ఆకేరు న్యూస్, ములుగు: సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర పరిశ్రమలలో గురువారం రాత్రి సమ్మక్క చిలకలగుట్ట దిగి వస్తున్న సమయంలో చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు,యువకులు అనే తేడా లేకుండా ఆనందంతో అమ్మవారి రాక కోసం జై సమ్మక్క తల్లి జై సారక్క తల్లి అనే నినాదాలతో చిలకల గట్టు రహదారి మారుమోగిపోయ్యాయి., సమ్మక్క తల్లి వచ్చే దారి వెంబడి అధిక సంఖ్యలో భక్తులతో కిక్కిరిసిపోయ్యారు., చెట్లు వాహనాలు వాటర్ ట్యాంకులు భవనాలు ఎక్కి అమ్మవారి రాకను స్వయంగా తిలకించాలని ఆత్రుతతో భక్తులందరూ ఉన్నారు,
ముగ్గులు,ఎదుర్కొల్లు, బలులతో రహదారి చిత్ర విచిత్రమైనది, శివసత్తుల పూనకలు,సమ్మక్క తల్లిని ఆవహించుకుని భక్తులు శిసత్తుల పూనాకాలతో అమ్మవారి రాకను స్వాగతిస్తూ దారి వెంట హారతులు సమర్పించారు. చిలకల గట్టు నుండి రాత్రి గద్దెలపైకి అమ్మవారు చేరుకోనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పోలీస్ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారి వెంబడి భారీకేడ్లు నిర్మించి రక్షణగా ఏర్పాట్లు చేశారు. ఆదివాసి గిరిజన సంఘాలు, అభ్యుదయ యువజన సంఘం, తుడుం దెబ్బ, ప్రత్యేక పోలీసు బలగాలు తదితర విభాగాల శాఖల సమన్వయంతో కలిసి అమ్మవారిని తీసుకొని గద్దె లకు బయలుదేరారు. ఈ అపూర్వమైన ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో చిలకల గట్టు రహదారి వెంబడి చేరుకున్నారు. సమ్మక్క -సారలమ్మ పగిడిద్దరాజులు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరి భక్తుల కోరికలు తీర్చేందుకు వనం నుండి వచ్చి తమ యొక్క కోరికలను నెరవేర్చాలి తల్లి అంటూ భక్తులు మొక్కలు చెల్లించుకోవడం కోనసాగుతోంది. సమ్మక్క తల్లీ రాకతో మేడారం జాతర పరిసర ప్రాంతాలు భక్తి భావంతో పులకించిపోయింది.
…………………………………………………………
