* అభివృద్ధి పనులపై ఆరా
* అధికారులతో సమీక్ష సమావేశం
ఆకేరు న్యూస్, ములుగు : మేడారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఆదివారం విచ్చేశారు. మధ్యాహ్నం 1:20 గంటలకు హెలికాప్టర్ ద్వారా వారు చేరుకున్నారు. కాగా, ఈనెల 5న మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి డెడ్ లైన్ పెట్టిన విషయం తెలిసిందే. పనుల్లో పురోగతిపై క్షేత్రస్థాయిలో పర్యటించారు. గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న గ్రానైట్ పనులను పరిశీలించారు. రోడ్ల నిర్మాణం, జంపన్న వాగు పనులకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేపటితో డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో ఇంకా పనుల పెండింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాదాపు పూర్తయ్యాయని చివరి దశలో కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయని అధికారులు వివరణ ఇచ్చారు. మహా జాతర 2026 ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
…………………………………………………….

