* దేశీయంగా మరో 75వేల మెడికల్ సీట్ల పెంపు
* పేదలకు ఆరోగ్యం చేరువ చేయాలన్న లక్ష్యం
* దర్బంగా ఎయిమ్స్ శంకుస్థాపనలో ప్రధాని మోడీ
ఆకేరున్యూస్, పాట్నా: త్వరలోనే హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ( NARENDRA MODI) పేర్కొన్నారు. ఇందుకోసం ప్రయత్నాలు ప్రారంభించామని అన్నారు. దేశీయ భాషల్లో వైద్యవిద్య వల్ల సామాన్యుల(COMMON PEOPLES) కు అందుబాటులోకి రావడమే కాకుండా, వైద్య సేవల్లో నాణ్యత పెరుగుతుందని అన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్ష మెడికల్ సీట్ల( MEDICAL SEATS)ను జోడిరచామని.. రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తామని వైద్య విద్యార్థులకు ప్రధాని హావిూ ఇచ్చారు. దేశంలో 1.5 లక్షలకు పైగా ఉన్న ’ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు’ బడుగు బలహీనవర్గాలకు మెరుగైన సేవలందిస్తున్నాయని తెలిపారు. దేశంలో దాదాపు నాలుగు కోట్ల మంది ప్రజలు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారన్నారు. దర్భంగా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ప్రధాని మోదీ ఎయిమ్స్ దర్భంగాను ప్రారంభించారు. 1260 కోట్ల రూపాయలతో భాగల్పూర్ ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేశారు. ఆరోగ్య రంగంలో ప్రధానంగా ఐదు అంశాలపై మా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నిరుపేదలకు మంచి ఆరోగ్య సౌకర్యాలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం అని ప్రధాన మంత్రి అన్నారు. సందర్భంగా ఎయిమ్స్ బీహార్ ఆరోగ్య రంగంలో భారీ మార్పు తీసుకువస్తుందని ఆయన అన్నారు.దేశప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం, వారి జీవితాలను సులభతరం చేయడం మా ప్రధాన కర్తవ్యమని ప్రధాని మోదీ అన్నారు. దర్భంగా ఎయిమ్స్ నిర్మాణంతో మిథిలా, కోసి, తిర్హట్ ప్రాంతాలతో పాటు, పశ్చిమ బెంగాల్, అనేక పరిసర ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సౌకర్యాలు ఉంటాయి. పొరుగు దేశం నేపాల్ నుండి వచ్చే రోగులు కూడా ఈ ఆసుపత్రిలో చికిత్స పొందగలరు.
దేశంలో ఆరోగ్యానికి సంబంధించి మా ప్రభుత్వం సమగ్ర దృక్పథంతో పనిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మా మొదటి దృష్టి వ్యాధి నివారణపై ఉంది. వ్యాధిని సక్రమంగా నిర్దారించడంపై రెండో దృష్టి, ప్రజలకు ఉచితంగా, చౌకగా వైద్యం అందించడం, వారికి తక్కువ ధరకే మందులు అందజేయడం, వైద్యుల కొరతను అధిగమించడం, చిన్న పట్టణాల్లోనూ అత్యుత్తమ వైద్య సదుపాయాలు కల్పించడం నాల్గవ దృష్టి. దేశంలో ఐదవ దృష్టి ఆరోగ్య సేవల్లో సాంకేతికతను విస్తరించడం ముఖ్యమని అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశంలోని పేదల జీవితాల్లో పెనుమార్పు తెస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పథకం కింద దేశంలో దాదాపు నాలుగు కోట్ల మంది చికిత్స పొందారు. ఆయుష్మాన్ భారత్ పథకం లేకుంటే వీరిలో ఎక్కువ మంది ఆసుపత్రిలో చేరి ఉండేవారు కాదు. ఆయుష్మాన్ యోజన ద్వారా కోట్ల కుటుంబాలు దాదాపు రూ.1.25 లక్షల కోట్లు ఆదా చేశాయని అన్నారు. బిహార్ లోని దర్భంగాలో నిర్వహించిన సభలో ప్రధాని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దర్భంగాలో ఎయిమ్స్‌కు ప్రధాని శంకుస్థాపన చేసి, రూ.12,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించారు. బిహార్‌లో నీతీశ్ కుమార్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు. ఆటవిక రాజ్యంగా ఉన్న రాష్టాన్న్రి ముఖ్యమంత్రి అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు కేవలం తప్పుడు వాగ్దానాలు మాత్రమే చేశాయని.. కానీ రాష్ట్రంలో నీతీశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పరిస్థితి మెరుగుపడిరదని పేర్కొన్నారు.
……………………………………..