
* అదిరిపోయే రికార్డ్
* కెరీర్లో 156 చిత్రాల్లో నటించిన మెగాస్టార్
* 1978 సెప్టెంబరు 22న కెరీర్ ప్రారంభించిన చిరంజీవి
* హైదరాబాదులో గిన్నిస్ బుక్ రికార్డు ప్రదానోత్సవం
* 537 పాటల్లో 24 వేల డ్యాన్స్ స్టెప్పులతో గిన్నిస్ బుక్ రికార్డ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. చిరంజీవి 1978 సెప్టెంబరు 22న తన కెరీర్ ప్రారంభించారు. మెగాస్టీర్ చిరంజీవి తన 45 ఏళ్ల కెరీర్లో 156 సినిమాల్లో నటించి, 537 పాటల్లో 24,000 డ్యాన్స్ స్టెప్పులు వేశారు. ప్రపంచంలో మరే నటుడూ ఇన్ని డ్యాన్స్ స్టెప్పులు వేసిన దాఖలాలు లేవు. మరే నటుడికి సాధ్యం కాని రీతిలో అత్యధిక స్టెప్పులతో గిన్నిస్ బుక్ రికార్డు నమోదు చేశారు. హైదరాబాదులో ఆదివారం జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ప్రతినిధులు హాజరై చిరంజీవికి రికార్డును అందజేశారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ చేతులమీదుగా చిరంజీవి అవార్డు అందుకోవడం విశేషం. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అల్లు అరవింద్, సుస్మిత, వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు హాజరై చిరంజీవిని అభినందించారు.
…………………………