ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వాతావరణ శాఖ మరోసారి తెలంగాణకు హెచ్చరిక జారీ చేసింది. నాలుగురోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్(Yello Allert)ని జారీ చేసింది. ఖమ్మం(Khamam), నల్గొండ(Nalgonda), సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. సోమవారం ఆదిలాబాద్(Adilabad), ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్(Nijamabad), జగిత్యాల, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని వివరించింది.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
